Serilingampally: 10 ఏళ్లు యుపిఐ విజయంపై రవికుమార్ యాదవ్ హర్షం
Serilingampally: UPI పేమెంట్స్ 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీరామ్ నగర్ మార్కెట్‌లో విక్రేతలు, వినియోగదారులతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్.
Serilingampally: 10 ఏళ్లు యుపిఐ విజయంపై రవికుమార్ యాదవ్ హర్షం
శేరిలింగంపల్లి: దేశంలోనే యుపిఐ పేమెంట్స్ విప్లవాత్మక మార్పు, చారిత్రాత్మక విజయం...బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ దేశవ్యాప్తంగా యుపిఐ పేమెంట్స్ పద్ధతిని ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ లో నిర్వహిస్తున్న చిరు వీధివ్యాపారులు కూరగాయల మార్కెట్ సందర్శించిన ...బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు డిజిటల్ ఇండియా పేరుతో తీసుకొచ్చిన చారిత్రాత్మక నిర్ణయం యుపిఐ పేమెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు చిదంబరం గారు ఎద్దవ చేస్తూ టి షాపులు, కూరగాయల వ్యాపారులు , చిన్న కిరాణా షాపుల కు మెషిన్స్ ఎవరిస్తారు, ఇంటర్నెట్ ఎవరిస్తారు, వైఫై ekkada ఉంటుంది.
ఇది ఒక తప్పుడు నిర్ణయం అన్నారని, కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రతి చిన్న కూరగాయలు, టి , మరియు బట్టల షాప్ ,ప్రతి పెద్ద వ్యాపారి యుపిఐ పేమెంట్స్ వాడుతున్నారని, తెలియజేసేందుకు నేను స్వయంగా కూరగాయలు అమ్మే దగ్గర కు వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని యుపిఐ పేమెంట్ చేయడం జరిగిందని మరియు చాయ్ దుకాణం వద్ద టీ కొని యుపిఐ పేమెంట్ చేయడం జరిగిందని.
వాళ్ళని అక్కడ ఉండే వినియోగదారులను కనుక్కుంటే చాలా ఉపయోగకరం గా ఉందని ఇంతకు ముందు చిన్న చిన్న షాపు లకు వెళ్ళినప్పుడు చిల్లర కోసం చాలా ఇబ్బందులు ఉండేవని ఇప్పుడు అలాంటివి ఏమి లేవని తెలియజేశారన్నారు, విప్లవాత్మక నిర్ణయానికి చరిత్రాత్మక విజయమని కొనియాడారు.
దేశంలో ప్రతి ఒక్కరు యుపిఐ పేమెంట్స్ వాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వాడుతున్నారని ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కోసం తీసుకొచ్చే నిర్ణయాలు , మార్పుల పై విమర్శలు మరియు ఎద్దేవ చేసేముందు ఆలోచించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఓబుల్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎయిర్టెల్ వెంకటేష్, రమేష్ యాదవ్, వెంకటేష్, మరియు స్థానిక నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




