Secunderabad: 220 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి కిషన్ రెడ్డి!
Secunderabad: సికింద్రాబాద్ రైల్ కళారంగ్‌లో జరిగిన 19వ రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Secunderabad: 220 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి కిషన్ రెడ్డి!
సికింద్రాబాద్: బోయిగూడలోని 'రైల్ కళారంగ్' లో నిర్వహించే "రోజ్‌గార్ మేళా" (Rozgar Mela) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యంశాలు …
19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ.. మరీ ముఖ్యంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకుంటున్న యువతీ యువకులకు హృదయపూర్వక అభినందనలు. ఇవాళ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో.. ఇవాళ జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో.. 51వేల మంది యువతీ, యువకులు వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అపాయింట్‌మెంట్ లెటర్స్ అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ఇవాళ ఈ వేదిక ద్వారా.. 220 మంది కొత్త జీవితాలు ప్రారంభించబోతున్నారు.
22 అక్టోబర్ 2022 నాడు దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు జరిగిన 18 రోజ్‌గార్ మేళాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది పైగా యువతకు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వ రంగ PSUల్లో ఉపాధి కల్పించాం. ఇవాళ్టితో కలుపుకుంటే.. పన్నెండున్నర లక్షల మంది (12.5 లక్షలు) కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.
రోజ్ గార్ మేళా ఒక కార్యక్రమం మాత్రమే కాదు. యువతకు సాధికారత కల్పించే దిశగా మోదీ గారి ఆలోచనల్లో నుంచి పురుడుపోసుకున్న ఒక ‘నేషనల్ మిషన్ ఇవాళ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చే మీరు.. వచ్చే 25 ఏళ్లపాటు దేశ ప్రగతిలో ప్రధానమైన భాగస్వాములయ్యే అవకాశం దొరికింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కల్పన మాత్రమే ఇది.
ఇది కాకుండా ప్రయివేటు రంగంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతోంది. స్టార్టప్స్, యూనికార్న్స్ వంటి వాటిని ప్రోత్సహించడం కారణంగా.. భారతీయ యువత ఉద్యోగాల కోసం వేచి చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు.
మరీ ముఖ్యంగా.. మోదీ సర్కారు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. హైవేస్, ఎయిర్‌పోర్ట్స్, ఇన్ఫోవేస్, రైల్వేస్, పోర్ట్స్, హౌజింగ్, మెట్రో ప్రాజెక్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ వంటి వివిధ రంగాల్లో.. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పన జరుగుతోంది.
అందరికీ ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించడం సాధ్యం కాదు. కానీ ప్రయివేటు సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో, ఇన్‌ఫ్రా సంస్థల్లో భారీ సంఖ్యలో ఉపాధి కల్పనకు మోదీ సర్కారు బాటలు వేసింది. దాదాపు ఏడాదికి రూ.12లక్షల కోట్ల మూలధన వ్యయంతో (కేపిటల్ ఎక్స్‌పెండీచర్) మన దేశంలో ఇన్‌ఫ్రా రంగం చాలా వేగంగా పనులు చేపడుతోంది.
దీని కారణంగా అదే సంఖ్యలో ఉపాధి కల్పన కూడా పెద్ద సంఖ్యలో జరుగుతోంది. కార్పొరేట్ సంస్థల లెక్కలు, ప్రభుత్వ అంచనాల ప్రకారం.. ప్రతి లక్షకోట్ల పెట్టుబడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 14-15 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దీని ప్రకారం.. దేశంలో ఉపాధి కల్పన ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోండి.
మనదేశంలో యువత సామర్థ్యానికి కొదువలేదు. అందుకే.. మోదీ గారు యువతను వికసిత భారత నిర్మాణంలో ‘సూపర్ హీరోస్’గా చూస్తున్నారు. అందుకే.. యువశక్తికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా, వారికి సరైన అవకాశాలు కల్పించడంపైనే వారు ప్రధానంగా దృష్టి సారించారు.
అదే సమయంలో యువతలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రెగ్యులర్ కోర్సులతోపాటుగా ఆధునిక సాంకేతికతను నేర్చుకోవడంపై ఆసక్తి పెరిగింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (స్కిల్ డెవలప్‌మెంట్) ద్వారా.. 1.7 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించారు.
దీంతోపాటుగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా స్కిల్స్ పెంచుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సాంకేతిక విషయాలను.. మాతృభాషలో బోధించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల యువత కెపాసిటీ కూడా పెరుగుతోంది.
దీని ఫలితంంగా ఇవాళ మన యువత.. ఆధునిక ప్రపంచంలో సత్తా చాటుతోంది. సెమీ కండక్టర్ల రంగంలో ప్రగతి సాధిస్తున్నాం. స్పేస్ టెక్నాలజీలో ముందున్నాం. డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాలకంటే ముందు మనమే.. చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకున్నాం.
మొన్నటికి మొన్న ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలోనూ.. శత్రుదేశాల క్షిపణులను మన స్వదేశీ డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఇవాళ మనం వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు, చిన్న పరిశ్రమల నుంచి దేశరక్షణలో కీలకమైన డ్రోన్ టెక్నాలజీ వరకు.. ఇలా ప్రతి రంగంలో ప్రపంచస్థాయి టెక్నాలజీని వాడుతూ ముందుకెళ్తున్నాం.
2047 నాటికి వికసిత భారత నిర్మాణం కోసం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవవడంలో మీలాంటి యువత పాత్ర చాలా కీలకం. అందుకే మోదీ ప్రభుత్వం.. యువతను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. యూనివర్సిటీల సంఖ్య పెరిగింది. కాలేజీల సంఖ్య పెరిగింది. మారుమూల ప్రాంతాల వరకు కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతోపాటుగా.. పీఎం-శ్రీ స్కూల్స్ సంఖ్యను పెంచాం.
ప్రపంచపు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం సాధించిన ప్రగతి.. రేపటిరోజు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతున్న తీరును చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచమంతా అస్థిరత, అశాంతి నెలకొన్న సందర్భంలోనూ.. మనదేశం అనుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో ముందుకెళ్తున్నాం.
మోదీ గారు యువతకు ఇస్తున్న ప్రోత్సాహం కారణంగానే.. 2014కు ముందు వందల సంఖ్యలో ఉన్న స్టార్టప్స్ ఇవాళ లక్షా 20వేలకు పైగా పెరిగాయి. దాదాపు వందకు పైగా యూనికార్న్స్ ఇవాళ దేశంలో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దీని కారణంగా యువత ఇంపాజిబుల్ ను Everything is Possible గా మార్చి సత్తా చాటుతోంది. అసంఘటిత రంగం నుంచి కార్పొరేట్ వరకు ప్రతి చోటా దూసుకెళ్తున్నాం.
సమస్యల్లో నుంచి అవకాశాలు వెతుక్కోవడం ద్వారా.. మనకు వ్యక్తిగతంగా, మన సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం లభిస్తుంది. అన్ని రంగాల్లో గత 12 ఏళ్లలో వచ్చిన సంస్కరణల కారణంగా.. ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇవాళ నేను బాధ్యతలు నిర్వహిస్తున్న బొగ్గు, గనుల రంగం.. కేవలం బొగ్గును, వివిధ మినరల్స్ ను తవ్వి తీసే వ్యవస్థ స్థాయి నుంచి చాలా ఎదిగింది.
ఉపాధికల్పనలో చాలా ముందడుగేశాం, పారిశ్రామిక ప్రగతిలో బొగ్గు రంగం ముద్ర కనబడుతోంది. లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ జరుగుతోంది. వీటన్నింటితోపాటుగా.. బొగ్గు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్లో కొత్త వెలుగులు తీసుకొస్తున్నాం. ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచాం, ప్రమాదాలు తగ్గేలా చొరవతీసుకుని మోదీ సర్కారు మీతోనే ఉందే భరోసాను వారిలో కల్పించాం.
క్రిటికల్ మినరల్స్ నుంచి క్లీన్ కోల్ టెక్నాలజీ వరకు వేల సంఖ్యలో అవకాశాల కల్పన జరుగుతోంది. మైనింగ్ ఇంజనీరింగ్ వైపు, సంబంధిత కోర్సులవైపు కూడా యువత దృష్టిపెట్టాలి. ఇందులో ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి. నేడు మీరు ఈ ఉద్యోగాలు సాధించడానికి దాని వెనకాల మీ అభివృద్ధి కోసం కృషి చేసిన తల్లిదండ్రులని ఎప్పటికే మర్చిపోవద్దు.
తల్లిదండ్రులు కచ్చితంగా గౌరవించాలి అని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే మీరు సాధించిన ఉద్యోగానికి సార్ధకత దేశానికి సేవ చేయడం తప్పు తల్లిదండ్రులు కూడా సేవ చేయాలి. మరోసారి మీ అందరికీ అభినందనలు, మీ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు.




