Vikarabad: యాలాలలో అనుమానాస్పద స్థితిలో మామా అల్లుడు మృతి!

Vikarabad: వికారాబాద్ కోకట్‌లో అబ్దుల్ లయాఖత్, గోరెప్ప అనుమానాస్పద స్థితిలో మృతి. మద్యం, కల్లు తాగాక ప్రాణాలు కోల్పోవడంతో కల్తీ కల్లు కోణంలో పోలీసుల దర్యాప్తు.

Srikanth Reddy, Tandur
Published on: 12 Aug 2026 7:54 AM IST
Vikarabad
X

Vikarabad: యాలాలలో అనుమానాస్పద స్థితిలో మామా అల్లుడు మృతి!

Vikarabad: యాలాల మండలంలోని కోకట్ గ్రామ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఇద్దరు(మామ, అల్లుడు) మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది, మృతుల శరీరాల పై ఎలాంటి గాయాలు, దెబ్బల ఆనవాళ్లు లేకపోవడంతో ఘటన పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..?

యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కోకట్ పరిధిలోని సుమిత్‌కు చెందిన స్టోన్ పాలిష్ మిషన్ యూనిట్ గదిలో వరుసకు మామ, అల్లుడైన అబ్దుల్ లయాఖత్ (45), గోరెప్ప (32) నివాసముంటున్నారు.

భోజనం అనంతరం మద్యం సేవించి నిద్రించిన వీరు, మంగళవారం ఉదయానికి మృతి చెంది కనిపించారు. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బలు లేవని పోలీసులు తెలిపారు. మృతికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story