Gachibowli: కిడ్నాప్ కలకలం.. గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులు!

Gachibowli: ఇద్దరు పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, పిల్లలను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 25 Aug 2026 10:05 AM IST
Gachibowli
X

Gachibowli: కిడ్నాప్ కలకలం.. గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులు!

Gachibowli: గచ్చిబౌలి ప్రాంతంలో గురువారం ఇద్దరు చిన్న పిల్లల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. మస్జీద్ బండ వద్ద ఉన్న ఒక కన్స్ట్రక్షన్ లేబర్ క్యాంప్‌లో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్టుండి మాయమయ్యారు.

బాధితులు, పోలీసుల సమాచారం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

లేబర్ క్యాంప్‌లో నివాసముంటున్న దినసరి కూలీల పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు పిల్లలను క్షేమంగా రక్షించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆ లేబర్ క్యాంప్‌లోనే పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story