Medipally: జోనల్ కమిషనర్ రాధికా గుప్తా క్షేత్రస్థాయి తనిఖీలు!
Medipally: మేడిపల్లి, పీర్జాదిగూడ లో జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, కాంగ్రెస్ నేత తుంగతుర్తి రవి వాటర్ లాగింగ్ ప్రాంతాలను పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టారు.
Medipally: జోనల్ కమిషనర్ రాధికా గుప్తా క్షేత్రస్థాయి తనిఖీలు!
మేడిపల్లి: వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ సమస్యపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
మేడిపల్లి 9వ డివిజన్, పీర్జాదిగూడ 10వ డివిజన్‌లలో వర్షాల కారణంగా నీరు నిలిచిపోయే ప్రాంతాలు, వాటర్ లాగింగ్ పాయింట్లను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, హైడ్రా ఇన్‌స్పెక్టర్ మోహన్‌తో కలిసి మేడిపల్లి (9వ) డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పరిశీలించారు.
ఈ సందర్భంగా వర్షపు నీరు నిల్వ కాకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను తుంగతుర్తి రవి కోరారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డ్రైనేజీలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచి, నీటి పారుదల వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటర్ లాగింగ్ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులనుజోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఆదేశించారు.
వర్షాల సమయంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.ఈ తనిఖీల్లో డీఈ సాయినాథ్ గౌడ్, ఏఈ సాయి కిరణ్, తిరుపతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




