Balapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్ టెక్నీషియన్ మృతి!
Balapur: మల్లాపూర్ విద్యా దాయని కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ టెక్నీషియన్ ఇంద్రారెడ్డి (23) అక్కడికక్కడే మృతి చెందాడు.
Balapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్ టెక్నీషియన్ మృతి!
బాలాపూర్: తేదీ 07.08.2025న రాత్రి సుమారు 01:40 గంటల సమయంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్, విద్యా దాయని కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మృతుడు ఎద్దుల ఇంద్రారెడ్డి, తండ్రి పేరు ప్రద్యుమ్నరెడ్డి, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి: RGI ఎయిర్‌పోర్టులో టెక్నీషియన్, నివాసం: TKR కమాన్ సమీపంలో, స్వస్థలం: కడప జిల్లా. ఇంద్రారెడ్డి తన ద్విచక్ర వాహనంపై LB నగర్ నుండి RGI ఎయిర్‌పోర్టు వైపు వెళ్తుండగా, RCI రోడ్డుపై వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇంద్రారెడ్డికి తలకు తీవ్ర రక్తస్రావ గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని మృతుడి రక్త సంబంధీకులకు అప్పగించారు.




