Telangana: టీపీసీసీ సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్‌గా దినేష్ నియామకం
Telangana: టీపీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా శ్రీ దినేష్ (సోను) నియమితులయ్యారు. ఆగస్టు 6న ఏఐసీసీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana: టీపీసీసీ సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్‌గా దినేష్ నియామకం
కీలక బాధ్యతలు..
టీపీసీసీ సోషల్ మీడియా విభాగం కో-కో ఆర్డినేటర్‌గా నియామకం..
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా విభాగంలో కో-కోఆర్డినేటర్‌గా శ్రీ దినేష్ (సోను)గారు నియమితులయ్యారు..
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.సి. వేణుగోపాల్ గారు ఆగస్టు 6న అధికారిక ప్రకటన విడుదల చేశారు..
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకంతో అప్పగించిన ఈ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని దినేష్ (సోను) గారు తెలిపారు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు..
పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని దినేష్ గారు తెలిపారు..
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అగ్ర నాయకత్వానికి, టీపీసీసీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
దినేష్ గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు..




