Keesara: చంద్రపురి కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్!

Keesara: చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్‌కు డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ నియామక పత్రం అందజేశారు.

PURENDAR, ALWAL
Published on: 7 July 2026 6:24 PM IST
Keesara
X

Keesara: చంద్రపురి కాలనీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీకాంత్ యాదవ్!

కీసర: కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ను టిపిసిసి అధ్యక్షులు ఉమా మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించిన సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు నియామక పత్రాన్ని శ్రీకాంత్ యాదవ్ కు అందజేశారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.పార్టీ ప్రతిష్ఠతకు కృషి చేయాలని , రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరే విధంగా కృషి చేయాలని సూచించారు.శ్రీకాంత్ యాదవ్ నాపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కి, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కి, నక్క ప్రభాకర్ గౌడ్ కి , సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story