Tirumalagiri: కేంద్రీయ విద్యాలయంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం
Tirumalagiri: తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో తృతీయ సోపన్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయెల్. 28 పాఠశాలల నుంచి 200 మంది గైడ్‌ల భాగస్వామ్యం.
Tirumalagiri: కేంద్రీయ విద్యాలయంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరం
తిరుమలగిరి: పి.ఎం. కేంద్రీయ విద్యాలయం తిరుమలగిరిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తృతీయ సోపన్ శిక్షణా శిబిరం సోమవారం ప్రారంభమైంది.ఆగస్టు 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరాన్ని కేవీఎస్ హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయెల్ ప్రారంభించారు.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 28 కేంద్రీయ విద్యాలయాల నుంచి సుమారు 200 మంది గైడ్ విద్యార్థులు,28 మంది ఎస్కార్ట్‌లు శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం,జట్టు స్ఫూర్తి, సేవాభావం, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడం శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కేంద్రీయ విద్యాలయం తిరుమలగిరి ప్రిన్సిపాల్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో శిబిరం నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం శివరాంపల్లికి చెందిన పీజీటీ జ్యోతి శిబిర నాయకురాలిగా వ్యవహరిస్తుండగా, శారద,చంద్రలేఖ,గంగా భవాని, మనీషా పరీక్షకులుగా పాల్గొంటున్నారు.
ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కలర్ పార్టీ ఘన స్వాగతం పలికింది.అనంతరం దీపప్రజ్వలన,ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. స్కౌటింగ్,గైడింగ్ ఉద్యమ పితామహులు లార్డ్ రాబర్ట్ బాడెన్-పవెల్, లేడీ ఒలావ్ బాడెన్-పవెల్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.విద్యార్థులు ప్రదర్శించిన గణేష్ వందనం, సోలో నృత్యం ఆకట్టుకోగా ముఖ్య అతిథి అభినందించారు.
ఈ సందర్భంగా శిబిర నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వం, క్రమశిక్షణ, సేవాభావం, జట్టు స్ఫూర్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడంలో స్కౌటింగ్, గైడింగ్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మూడు రోజుల శిక్షణలో తృతీయ సోపన్‌కు సంబంధించిన వివిధ నైపుణ్యాలను విద్యార్థులకు ఆచరణాత్మకంగా నేర్పించనున్నట్లు తెలిపారు.




