kuntloor: రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ!

kuntloor: నాగోల్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 15 Sept 2026 1:12 PM IST
kuntloor
X

kuntloor: రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ!

kuntloor: నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొనడంతో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

రాజీవ్‌ గృహకల్ప నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తున్న హయత్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెయిన్‌ రోడ్డును క్రాస్‌ చేస్తున్న సమయంలో.. నాగోల్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను వనస్థలిపురం, సికింద్రాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

సమాచారం అందుకున్న నాగోల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR