Malkajgiri: మల్కాజిగిరిలో తొలి ఏకాదశి శోభ.. శ్రీవారి దివ్య దర్శనం!
Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.
Malkajgiri: మల్కాజిగిరిలో తొలి ఏకాదశి శోభ.. శ్రీవారి దివ్య దర్శనం!
Malkajgiri: మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబాయి వెంకటరమణాచార్యులు స్వామి వారిని తులసీలతో, పూలతో అరటిపండ్లతో ఎంతో అత్యంత రమనీయంగా, అలంకరించారు.
ఆషాడ శుద్ధ ఏకాదశి - శయన ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి వరకు చాతుర్మాసం(శ్రీ మహావిష్ణువు యోగనిద్రాకాలం) శయనకోలంలో సాలగ్రామ నారాయణుడిని దర్శనానికి తీర్చిదిద్దారు.
అలాగేతొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలోని విశేష పుష్పాలంకరణలో శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఆది పండుగ తొలి ఏకాదశి పర్వదినాన మల్కాజిగిరి ప్రాంత ప్రజలంతా పెద్ద ఎత్తున స్వామివారులను దర్శించుకోవడం జరుగుతుంది.




