Balapur: జిల్లెలగూడ ఆలయంలో ఉద్రిక్తత.. బ్రహ్మోత్సవాల షాపులపై వివాదం!

Balapur: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో షాపుల కేటాయింపు వివాదానికి దారితీసింది.

RAHUL, MEERPET
Published on: 1 May 2026 6:59 AM IST
Balapur
X

Balapur: జిల్లెలగూడ ఆలయంలో ఉద్రిక్తత.. బ్రహ్మోత్సవాల షాపులపై వివాదం!

Balapur: జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు - షాపుల కేటాయింపు విషయం లో గందరగోళం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో షాపుల కేటాయింపులో అన్యమతస్తులకు ఇవ్వకూడదని EO కి ధర్మరక్షణ దళం తరఫున లెటర్ ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఈఓ వినతిని పరిగణనలోకి తీసుకోకుండా షాపులను కేటాయించారు అని మండిపాడారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఈరోజు నితిన్ మరియు రాఘవేంద్ర ముదిరాజ్ ఆధ్వర్యంలో ధర్మరక్షణ దళం సభ్యులు ఆలయానికి వెళ్లి షాపులు నిర్వహించకుండా అడ్డుకోవడం జరిగింది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగా షాపుల కేటాయింపు జరగాలని కోరారు . ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు పున:పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story