Vikarabad: పార్టీలకతీతంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: స్పీకర్!
Vikarabad: ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు.
Vikarabad: పార్టీలకతీతంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: స్పీకర్!
వికారాబాద్: జిల్లా అభివృధి కోసము పార్టీల కతీతంగా నా వంతు సహాయసహకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
మంగళవారము మోమిన్ పెట్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశము హాలు నందు జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయి సమావేశాలకు అన్ని శాఖల అధికారులు సరైన, పూర్తి స్థాయి సమాచారం అందించాలని, శాఖల వారిగా సమస్యలు, అవసరమైన పనుల వివరాలను అందిస్తే సాద్యమైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి , ప్రజలు ఫోన్ చేస్తే తప్పని సరిగా స్పందించాలని , ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించి వాటిని పరిష్కరించాలన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నదని,
విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తుందని,
ప్రతి మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేసి విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఏర్పాటుతో పాటుగా గ్రామాల నుండి బస్సుల ద్వారా రవాణా సౌకర్యం కల్పిచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు కార్పోరేట్ విద్యను అందించాలనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే విదంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని వర్షాలు కురిసినప్పుడు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోనికి ఇంకిస్తే భూగర్బ జలాలు పెరుగుతాయన్నారు.
దేశంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటుగా, భూగర్భజలాలు పెంపొందించాలన్నారు.
స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యుపిఏ చైర్మన్ గా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేని కాలంలో కూలీలు వలసలు పోకుండా స్థానికంగానే ఉపాధి కల్పించడానికి పనికి ఆహార పథకాన్ని ప్రారంభించి, దానిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మార్చారు.
ఈ పథకంలో వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. దీనితో గ్రామాలలో ప్రజలకు ఉపాధి దొరికింది. తదనంతరం గ్రామాలలో మిగిలిన అభివృద్ధి పనులకు MNREGS ను విస్తరించారన్నారు.
ప్రతి గ్రామం నుండి మండలం వరకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారని , ఒక్కో గ్రామానికి ప్రత్యేకంగా కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి, 200 యూనిట్లు కరెంటు ఇచ్చి, మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ,డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి, మహిళలను లక్షాదికారులనుచేయాలన్నదే మా లక్ష్యమన్నారు.
వికారాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి పథకాల ద్వారా ప్రయత్నాలు చేశాను. అయితే గత ప్రభుత్వం పదేళ్ళు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది, పనులు జరుగలేదు.
అయితే ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ళు దగ్గరి ప్రాంతం వరకు వస్తున్నాయి, మాకు కూడా ఇప్పించాలని కోరగా ముఖ్యమంత్రి సరే అన్నారని , వికారాబాద్ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇచ్చే బాధ్యత నాదేనని ఈ సందర్బంగా అన్నారు.
జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై సర్పంచులు, వార్డు మెంబర్ లు పూర్తి అవగాహనా కలిగి ఉండాలన్నారు.
మండల, గ్రామా పంచాయతి స్థాయి సమావేశాలు నిర్వహించి, ప్రజల సమస్యలపై ద్రుష్టి సారించాలన్నారు. ప్రతి గ్రామ ,మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటింస్తేనే గ్రౌండ్ లెవల్లో సమస్యలు తెలుసు కోవచ్చాన్నారు.
ఎలినినో వల్ల రైతులు పంట నష్ట పోకుండా కూరగాయలు, ఆయిల్ ఫార్మ్ పంటల పై ద్రుష్టి సారించేలా రైతులకు అవగాహనా కలిపించాలన్నారు. గ్రామం లో మంచినీటి సమస్య, విద్యుత్, పాత బిల్డింగ్ లు, ఆరోగ్యము పై ఉన్న సమస్యలు తెలుసుకొని , అధికారులు అందుబాటులో ఉండి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం స్పీకర్, జిల్లా కలెక్టర్ లతో స్కూల్ విద్యార్థిని లకు స్కూల్ యూనిఫామ్ అందజేశారు. సమావేశములో మార్కెట్ కమిటి చైర్మెన్ మహేందర్ రెడ్డి, జాడ్ పి సి ఇ ఓ సుధీర్, తహసిల్దార్ మున్నేర్ అహమ్మద్,సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పంచాయతి సెక్రటరీ లు గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు.తదితరులు పాల్గొన్నారు.




