Hyderabad: భావి బాస్కెట్‌బాల్ తారలకు వేదిక.. హైదరాబాద్‌లో జూనియర్ లీగ్ ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ ప్రారంభమైంది. రూ. 1.48 కోట్ల కార్పొరేట్ పెట్టుబడులతో 12 జట్లు పోటీ పడుతున్నాయి.

RAJESH,	WEST ZONE
Published on: 20 Jun 2026 11:39 AM IST
Hyderabad
X

Hyderabad: భావి బాస్కెట్‌బాల్ తారలకు వేదిక.. హైదరాబాద్‌లో జూనియర్ లీగ్ ప్రారంభం!

Hyderabad: యువ క్రీడాకారుల ప్ర‌తిభ‌ను వెలికితీసేందుకు తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేష‌న్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ అన్నారు.

హైద‌రాబాద్ యూసూఫ్ గూడ కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నేటి నుండి 28 వ తేదీ వ‌ర‌కు తెలంగాణ జూనియ‌ర్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు . ఈ పోటీల్లో పాల్గొనే 12 టీంల‌ను కోటి 48 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో కార్పొరేట్ సంస్థలకు చెందిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

అండర్ 15,18 కేటగిరిలో బాలురు, బాలికలకు చెందిన 12 జట్లు లీగ్ లో పాల్గొంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల 288 మంది యువ క్రీడాకారులను ఎంపిక చేసిన‌ట్లు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు.

పది రోజుల పాటు జరిగే లీగ్ లో యువ క్రీడాకారులు తమ ప్రతిభను కనపరచడానికి మంచి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో బాస్కెట్ బాల్ కు గత కొంత కాలంగా క్రేజ్ పెరుగుతుందని.. ప్రీమియర్ లీగ్ లోని జట్లను కార్పొరెట్ సంస్థలు కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు.

లీగ్ లో ఉత్తమ ప్రదర్శన చేసే క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ వేదికలతో పాటుగా జూనియర్ ఎన్ బిఎలో అవకాశాలు ఉంటాయని తెలిపారు.

దేశంలో ప్రముఖ ప్రీమియం ఆభరణాల ప్రదర్శన పాన్ ఇండియా జ్యూవెల్స్ షోకు భాగ్య‌న‌గ‌రం వేదిక కావ‌డం సంతోషంగా ఉంద‌ని మ‌ల్లారెడ్డి విశ్వ విద్యా పీఠం వైస్ ఛైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story