Quthbullapur: బీరప్ప హాల్‌కు నిధులు మంజూరు!

Quthbullapur: తెలంగాణ ప్రభుత్వం నుండి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 2 Aug 2026 8:34 AM IST
Kutbullapur
X

Kutbullapur: బీరప్ప హాల్‌కు నిధులు మంజూరు!

Quthbullapur: తెలంగాణ ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీ పర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సహకారంతో మంజూరు కావడం పట్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు జగద్గిరిగుట్ట కురుమ సంఘ కమిటీ సభ్యులు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గణేష్, జగద్గిరిగుట్ట కురుమ సంఘం అధ్యక్షులు దేవరీ మల్లేష్ కురుమ, సెక్రటరీ యాదగిరి కురుమ, జగద్గిరిగుట్ట కురుమ సంఘం మహిళా అధ్యక్షురాలు బాల బోయిన లలిత కురుమ, సలహాదారు బొమ్మ శ్రీధర్ కురుమ, నరసింహ కురుమ,శేఖర్ కురుమ, పరుశురాం కురుమ, తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story