Malkajgiri: మాజీ కౌన్సిలర్ ఆనంద్ గౌలికర్ పార్థివదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాళి!

Malkajgiri: మల్కాజిగిరిలో బీజేపీ సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ ఆనంద్ గౌలికర్ పార్థివదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూలమాల వేసి అంజలి ఘటించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 9 Aug 2026 9:28 PM IST
Malkajgiri
X

Malkajgiri: మాజీ కౌన్సిలర్ ఆనంద్ గౌలికర్ పార్థివదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాళి!

మల్కాజ్గిరి: బీజేపీ సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ ఆనంద్ గౌలికర్ పార్థివదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాళులర్పించారు. మల్కాజిగిరిలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన ఆనంద్ గౌలికర్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆనంద్ గౌలికర్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆనంద్ గౌలికర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మల్కాజిగిరికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆనంద్ గౌలికర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story