Vikarabad: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన అడిషనల్ సీఈఓ, కలెక్టర్!
Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను తెలంగాణ రాష్ట్ర అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు.
Vikarabad: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన అడిషనల్ సీఈఓ, కలెక్టర్!
వికారాబాద్: శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణ లో గల ఈవీఎం గోడౌన్ ను అడిషనల్ సి ఇ ఓ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ వెంకటాచారి గార్ల తో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను కుణ్ణంగా పరిశీలించారు.
సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమములో డి ఆర్ ఓ స్వర్ణ లత, ఆర్ డి ఓ వాసు చంద్ర, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Next Story




