Tarnaka: తార్నాక క్యాంపు కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ!

Tarnaka: పర్యావరణ పరిరక్షణ కోసం తార్నాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు ఉచితంగా విగ్రహాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

HARISH, TARNAKA
Published on: 11 Sept 2026 7:00 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాక క్యాంపు కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ!

తార్నాక: పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మెంబర్ మోతే శోభన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు తార్నాకలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రజలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA