Tarnaka: తార్నాకలో బీజేపీలోకి చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన రావు!
Tarnaka: హైదరాబాద్‌ను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విషాద నగరంగా మారుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు విమర్శించారు.
Tarnaka: తార్నాకలో బీజేపీలోకి చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన రావు!
Tarnaka: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీలు ఇచ్చి, నేడు నగరాన్ని విషాద నగరంగా మారుస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధులను పట్టణాల అభివృద్ధికి సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తార్నాకలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీలో భారీ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా మాదల రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి ఎన్. రామచంద్రరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ సంకల్పంతో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, పట్టణాల సమగ్రాభివృద్ధికి పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాలను సుందర నగరాలుగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన వరల్డ్ క్లాస్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఎన్. రామచంద్రరావు స్పష్టం చేశారు.




