Tandur: తాండూరులో వినాయక విగ్రహాల 'ఆగమన' ఊరేగింపులకు నో పర్మిషన్!

Tandur: వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఆగమన ఊరేగింపులకు అనుమతి లేదని ప్రకటించిన తాండూరు సీఐ పరమేశ్వర్ గౌడ్.

Srikanth Reddy, Tandur
Published on: 1 Sept 2026 6:05 PM IST
Tandur
X

Tandur: తాండూరులో వినాయక విగ్రహాల 'ఆగమన' ఊరేగింపులకు నో పర్మిషన్!

Tandur: వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక మంటపాలలో ఏర్పాటుచేసే వినాయక విగ్రహాలను ప్రతిష్ట కోసం నిర్వాహకులు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి ఊరేగింపులు(ఆగమన) చేసుకోవడానికి పోలీస్ శాఖ తరపున అనుమతులు ఇవ్వలేదని పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఊరేగింపులు చేసే సమయంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగి ఆస్తి ప్రాణ నష్టాలు కలిగితే ఆ బాధ్యత నిర్వాహకులదేనని అన్నారు.

అనుమతి లేని ఊరేగింపులపై దృష్టి పెట్టె బదులు శాంతియుతంగా మంటపాలలో విగ్రహాలను ప్రతిష్టించి విఘ్నేశ్వరునికి నిర్విరామ పూజాదికాలు నిర్వహించి నిర్వాహకులు తమ భక్తుని చాటుకోవాలని అన్నారు. ఆడంబరాలకు పోయి ఊరేగింపులపై దృష్టి పెట్టి అమూల్యమైన ఆస్తి ప్రాణ నష్టాలకు తావివద్దని సూచించారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story