Tandur: అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న 7వ వార్డు తాండూరు కౌన్సిలర్ ఇర్షాద్

Tandur: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని కౌన్సిలర్ ఇర్షాద్ తెలిపారు.

Srikanth Reddy, Tandur
Published on: 8 Aug 2026 3:44 PM IST
Tandur
X

Tandur: అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న 7వ వార్డు తాండూరు కౌన్సిలర్ ఇర్షాద్

Tandur: తాండూర్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని కౌన్సిలర్ ఇర్షాద్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షద్ మాట్లాడుతూ,ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వార్డులో నెలకొన్న సమస్యల్లో భాగంగా సీసీ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది, అదేవిధంగా వార్డులో ప్రతిదీ అభివృద్ధి చేయించే బాధ్యత నాది అంటూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే అభివృద్ధి దిశగా ఒక్కో పని పూర్తి చేస్తూ ముందుకు వెళ్తాను అని చెప్పుకొచ్చారు.

ప్రజల ప్రేమ, ఆశీర్వాదం ఉన్నంతకాలం రాబోయే రోజుల్లో వార్డ్ లో పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాను. ఎవరు ఎంత అడ్డుకున్నా అభివృద్ధి పనులు ఆగవు. ప్రజలకు ఇచ్చిన మాటే నా బాధ్యత, వార్డు ప్రజల కోసం అభివృద్ధి చేయడం నా లక్ష్యంగా నేను నిర్వహిస్తని అన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story