Tandur: రూ.20 లక్షల అంబులెన్స్ అందజేత బీఎంఆర్ బర్త్‌డే ప్రత్యేకత!
Tandur: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Tandur: రూ.20 లక్షల అంబులెన్స్ అందజేత బీఎంఆర్ బర్త్‌డే ప్రత్యేకత!
Tandur: ఘనంగా బిఎంఆర్ జన్మదిన వేడుకలు
యునైటెడ్ వే బెంగళూరు స్వచ్ఛంద సంస్థచే అంబులెన్స్ పంపిణీ
రక్తదాన శిబిరంతో మానవత్వం చాటుకున్న బి.ఎం.ఆర్ సేన
నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. బెంగుళూరుకు చెందిన యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థ రూపాయలు 20 లక్షల వ్యయంతో అత్యవసర సేవల కోసం అంబులెన్స్ ను తాండూరు జిల్లా ఆసుపత్రి కి బహుమతిగా అందించారు. తాండూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ అందజేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని సంక్షేమ వసతి గృహంలో సుమారు 200 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పచ్చదనాన్ని పెంపొందించే దిశగా పలు వార్డు లలో మొక్క నాటడo జరిగింది. నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంటలు పంపిణీ చేశారు. తాండ్ర పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో జన్మదిన వేడుక సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక నేతలు అభిమానుల మధ్య ఎమ్మెల్యే కుమారులు కేక్ కట్ చేసి సందడి చేశారు.




