Vikarabad: మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Vikarabad: మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం!
వికారాబాద్: పర్యావరణాని కి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు కోరారు. తాండూరు గోశాల ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు జరుపుకునే వినాయకుడి పండుగ హిందువులకు ఎంతో విశిష్టమైనదన్నారు. ప్రతి భక్తుడు తన ఇంటిలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారన్నారు. అలాంటి వినాయకుడి ప్రతిమ దేనితో తయారు చేసి పూజించాలని శాస్త్రం చెబుతోందనే విషయాలను తెలుసుకుందామన్నారు. పురాణాల ప్రకారం గణేషుడు మట్టితో చేసిన రూపంలో ఎక్కువగా మనకు కనిపిస్తాడన్నారు. మట్టి గణపతి పూజించడం ద్వారా అనేక యుగాల ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారన్నారు.
మట్టి గణపతి నుంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందన్నారు. మట్టితో చేసిన విగ్రహం గురించి హిందు గ్రంథాలు, పురాణాల్లో కూడా ప్రస్తావించారన్నారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణం కి మేలుచేయడమే కాకుండా.. ఇలా పూజించడం ద్వారా వినాయకుడి పూజాఫలం కూడా సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారన్నారు.
పురాణాల్లో మట్టి గణపతిని ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే మట్టి గణపతిని శుభప్రదంగా భావిస్తారన్నారు. ఆచార్య వరాహమిహితుడు తన గ్రంథం బృహత్సంహితలో భూసంబంధమైన మట్టి విగ్రహాలు పూజించడం శుభమని వివరించాడన్నారు. మట్టి గణనాథుడు కాకుండా పసుపుతో కూడా గణేశుని ప్రతిమ తయారుచేసి పూజించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, ఓం ప్రకాష్ సోమని, మన్మోహన్ సరడా,కట్కం వీరేందర్ ,పటేల్ విజయ్ కుమార్, నాగారం జగదీష్, పర్యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




