Tandur: తాండూరులో విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

Tandur: తాండూరులో విద్యార్థులు, యువత నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో మోసగించిందని విమర్శించారు.

Srikanth Reddy, Tandur
Published on: 5 Sept 2026 1:59 PM IST
Tandur
X

Tandur: తాండూరులో విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

Tandur: 420 హామీలు 6 గ్యారెంటీ లంటూ ప్రజలను మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ను నమ్మి మోసపోయి గోస పడుతున్నామని తాండూరు బీ ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ...

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. నేడు తెలంగాణలో నిరుద్యోగ యువత ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ ఆ కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు.

తాండూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడుతూ మోసగించబడ్డారన్నారు. గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణను ఏ విధంగా మోసం చేశారో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

నేడు చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాలు అందరూ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు నడుం బిగించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకునే ప్రతి యువతికి స్కూటీలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు.

ల్యాప్టాప్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కనీసం లాప్టాప్ బొమ్మ కూడా ఇవ్వలేదన్నారు. కాలేజీల్లో ఉన్న కంప్యూటర్లు సరిగా పనిచేయకపోతే వాటిని బాగు చేయించలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story