Tandur: తాండూర్ కాంగ్రెస్ గూటికి పలువురు బీఆర్ఎస్ నాయకులు

Tandur: తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు.

Srikanth Reddy, Tandur
Published on: 8 July 2026 4:54 PM IST
Tandur
X

Tandur: తాండూర్ కాంగ్రెస్ గూటికి పలువురు బీఆర్ఎస్ నాయకులు

తాండూర్: తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఇంద్రనగర్‌కు చెందిన షేక్ ఖాసీం అలీ, షేక్ పాషాతో పాటు పలువురు స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...

కొత్త – పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కుటుంబ సభ్యుల మాదిరిగా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సిములుతో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, పలువురు సీనియర్ నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు...

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story