Tandur: తాండూరు ఓటరు జాబితా సవరణపై శ్రీశైల్ రెడ్డి సమీక్ష
Tandur: తాండూరులో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులకు సూచన.
Tandur: తాండూరు ఓటరు జాబితా సవరణపై శ్రీశైల్ రెడ్డి సమీక్ష
తాండూర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అధికారులు బిఎల్వోలు ముందుకు సాగాలని బీఆర్ యస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ , యాలల మండలాలలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సచివాలయ సిబ్బంది, ఆర్ ఐ, బి ఎల్ వో లతో సమీక్ష సమావేశం నిర్వహించి హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ....
ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగడంతో పాటు ప్రజలకు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను వెనువెంటనే పరిష్కరించి పారదర్శంగా ప్రక్రియను కొనసాగించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నిమరేషన్ ప్రక్రియను కొనసాగించాలన్నారు.
ముజ్ తబా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఎస్ఐ ఆర్ హెల్ప్ డెస్క్ ను పరిశీలించి వారు అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటర్ కు అవసరమైన సహాయం అందించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ప్రతి అర్హుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు.




