Tandur: ఎన్నికల హామీలు అమలు చేయాలి - బీఆర్‌ఎస్ నేతల డిమాండ్

Tandur: తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రజావాణిలో పాల్గొని కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై దరఖాస్తు అందజేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 7 Sept 2026 5:37 PM IST
Tandur
X

Tandur: ఎన్నికల హామీలు అమలు చేయాలి - బీఆర్‌ఎస్ నేతల డిమాండ్

తాండూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీల అమలను వెంటనే నెరవేర్చి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని యాలాల మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ తాండూరు ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తు సమర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ....

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన "ఆరు గ్యారంటీలు" మరియు దాదాపు 420 అసంపూర్ణ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని 420 హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

వెయ్యి రోజులు గడుస్తున్నా కూడా నేటికీ ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పాలన వైఫల్యం పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సమర శంఖం పూరించిందన్నారు. వ్యవసాయ రంగానికి సాగు నీరు విడుదల చేయకుండా, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా, యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందన్నారు.

వృద్ధులు, వికలాంగులకు నాలుగు వేల పింఛన్, మహిళలకు రెండు వేల పింఛను ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. విద్యార్థులు, యువకులకు విద్యా భరోసా కార్డులు, రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వడ్డే రాములు, కిరణ్, కృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story