Talakondapally: పడకల్ సమస్యలను ఎమ్మెల్యే కసిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్

Talakondapally: తలకొండపల్లి MPDO కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి పడకల్ గ్రామ సమస్యలపై వినతి. బిటి రోడ్లు, విద్యుత్, సిసి రోడ్ల నిధుల మంజూరుకు సర్పంచ్ సునీత విజ్ఞప్తి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 July 2026 4:01 PM IST
Talakondapally
X

Talakondapally: పడకల్ సమస్యలను ఎమ్మెల్యే కసిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.

ఈ సందర్భంగా పడకల్ గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి పడకల్ గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేకు దృష్టికి తీసుకువెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలు తలకొండపల్లి నుండి రావిచెడు గ్రామం వరకు బీటీ రోడ్డు,

పెద్దూర్ తండా నుండి పడకల్ వరకు బిటీ రోడ్, గ్రామంలో ఐరన్ ఎలక్ట్రికల్ పోల్స్ తీయించి సిమెంట్ పోల్స్ వేయించాలని, గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని,

వెటర్నరీ డాక్టర్లు నియమించాలని, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్ సమస్యల పరిష్కరానికి నిధులు మంజూరు ఏర్పాటు చేయాలని కోరారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story