Kalwakurthy: ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: సుంకిరెడ్డి!
Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం తుక్కుగూడలో ప్రత్యేక జాబ్ డ్రైవ్ నిర్వహించారు.
Kalwakurthy: ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: సుంకిరెడ్డి!
కల్వకుర్తి: ఈరోజు తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో జరిగిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఐక్యత పౌండేషన్ చైర్మన్ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ కు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వెల్దండ మండలం నుండి 11 మంది , కల్వకుర్తి మండలం నుండి 7 గురు, ఆమనగల్ మండలం నుండి 16, తలకొండపల్లి మండలం నుండి 01 ఒక్కరు మొత్తం 35 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు నిరంతరంగా కొనసాగుతాయన్నారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు అందుబాటులోకి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అర్హత, నైపుణ్యాలకు అనుగుణంగా లభించే అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర , మహేష్ ఐక్యత పౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్ మరియు ఇంటర్వ్యూ కు హాజరైన నిరుద్యోగ యువత పాల్గొన్నారు.




