Dilsukhnagar: టెలిగ్రామ్ టాస్క్ మోసం విద్యార్థికి రూ.4.31 లక్షలు టోకరా!

Dilsukhnagar: ఎల్‌బీనగర్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో టెలిగ్రామ్ పార్ట్‌టైమ్ జాబ్ మోసం వెలుగులోకి వచ్చింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Aug 2026 8:21 AM IST
Dilsukhnagar
X

Dilsukhnagar: టెలిగ్రామ్ టాస్క్ మోసం విద్యార్థికి రూ.4.31 లక్షలు టోకరా!

Dilsukhnagar: ఎల్‌బీనగర్...: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో టెలిగ్రామ్‌లో వల వేసిన సైబర్ మోసగాళ్లు ఓ విద్యార్థి నుంచి రూ.4.31 లక్షలు దోచుకున్న ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో వెలుగుచూసింది.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన చరణ్ కౌశిక్‌కు జూలై 15న టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌కు సంబంధించిన సందేశం వచ్చింది. రోజుకు కొన్ని టాస్కులు, గూగుల్ రివ్యూలు పూర్తి చేస్తే పారితోషికం ఇస్తామని నమ్మించారు. మొదట మూడు టాస్కులకు రూ.120 చెల్లించడంతో అతడు వారిని విశ్వసించాడు.

ఆ తర్వాత పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. తొలుత రూ.5 వేల పెట్టుబడికి రూ.7 వేలు తిరిగి ఇవ్వడంతో మరింత నమ్మకం కలిగింది. దీంతో కుటుంబ సభ్యుల సహకారంతో దశలవారీగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు.

మధ్యలో కేవలం రూ.10 వేలే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చి, అనంతరం మరిన్ని చెల్లింపులు చేయించారు. చివరకు మొత్తం రూ.4.31 లక్షలు కోల్పోయిన తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, తెలియని వ్యక్తులు పంపే టెలిగ్రామ్ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లను నమ్మవద్దని, పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story