Hyderabad: హయత్ నగర్.. జెడ్పీ స్కూల్ నీట్ పరీక్షా కేంద్రం వద్ద హై అలర్ట్!

Hyderabad: ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 21 Jun 2026 2:29 PM IST
Hyderabad
X

Hyderabad: హయత్ నగర్.. జెడ్పీ స్కూల్ నీట్ పరీక్షా కేంద్రం వద్ద హై అలర్ట్!

హైదరాబాద్: ప్రశ్నాపత్రాలు లీకేజీ కారణంగా ఈరోజు నిర్వహిస్తున్న నీట్ రీ ఎగ్జామ్ కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు.

పరీక్ష కేంద్రం సమీపంలో ఎలాంటి షాపులు ఓపెన్ ఉండకుండా పూర్తిగా మూసి వేయించారు పోలీస్ లు.పరీక్ష కేంద్రానికి వస్తున్న అభ్యర్థులకు పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు.

తెలంగాణ వ్యాప్తంగా సుమారు 73000 మంది అభ్యర్థులు నీట్ ఎగ్జాం కి హాజరుకారున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల వరకు నీట్ ఎగ్జాం కొనసాగనుంది.

ఒక్కో అభ్యర్థి వెంట కేవలం ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పరీక్ష కేంద్రంలో కెమెరాలు అమర్చి పూర్తిగా పరీక్ష జరుగుతున్న తీరును లైవ్లో అధికారులు పరిశీలించనున్నారు,ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్ర వద్ద పనిచేయకుండా జామర్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story