Madhapur: డీసీఎం బీభత్సం.. 10 వాహనాలు ధ్వంసం, ఏడుగురికి గాయాలు!
Madhapur: హైదరాబాద్ మాదాపూర్‌లో డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో 10 వాహనాలను ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Madhapur: డీసీఎం బీభత్సం.. 10 వాహనాలు ధ్వంసం, ఏడుగురికి గాయాలు!
మాదాపూర్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం వరుసగా పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాత్రి మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ రోడ్డులో ఉన్న క్యాపిటల్ ల్యాండ్, గేట్ నెం. 03 సమీపంలో TS34TB2353 నంబరు గల డీసీఎం వాహనం వేగంగా దూసుకొచ్చింది. సదరు వాహనాన్ని డ్రైవర్ అనిల్ కుమార్ అరోల్లా అతివేగంగా, తీవ్ర నిర్లక్ష్యంగా నడుపుతూ ముందు వెళ్తున్న ఆక్టివా ద్విచక్ర వాహనంతో పాటు దారిలో ఉన్న ఇతర వాహనాలను వరుసగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మొత్తం 10 వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురు బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారెవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని పోలీసులు ధ్రువీకరించారు. అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.




