Pargi: పరిగిలో కారు బీభత్సం.. పాదచారులను ఢీకొట్టిన వాహనం!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఘోర కారు ప్రమాదం.
Pargi: పరిగిలో కారు బీభత్సం.. పాదచారులను ఢీకొట్టిన వాహనం!
Pargi: పరిగి పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. రోడ్డుపై నడుస్తున్న పాదచారులను ఢీకొట్టడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. షాద్‌నగర్ నుండి పరిగి వైపు వస్తున్న ఒక కారు, కొడంగల్ చౌరస్తా సమీపంలో అతివేగం కారణంగా అదుపు తప్పింది.
ప్రమాదం జరిగిన తీరు గమనిస్తే.. అతివేగంగా వచ్చిన కారు, ముందుగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను ఢీకొట్టి, చివరికి ఫుట్‌పాత్ పై నిలిపి ఉంచిన మరో కారును ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఉన్న వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. స్థానికుల సహాయంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పరిగి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.




