Medipally: బోడుప్పల్‌లో అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌పై ఎస్‌ఓటీ దాడులు!
Medipally: పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌పై ఉప్పల్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి, కాలం చెల్లిన హానికర రంగులు, పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు.
Medipally: బోడుప్పల్‌లో అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌పై ఎస్‌ఓటీ దాడులు!
Medipally: కేకుల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా హానికరమైన, కాలం చెల్లిన పదార్థాలను వినియోగిస్తున్న బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి బోడుప్పల్ రోడ్డులోని మల్లికార్జున్‌నగర్‌లో ఉన్న అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్‌లో సోమవారం తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో కేకుల తయారీకి ఉపయోగిస్తున్న అమోనియా పొడి, నిమ్మ పసుపు కృత్రిమ ఆహార రంగు, నారింజ ఎరుపు కృత్రిమ ఆహార రంగుతో పాటు ఇతర కృత్రిమ రంగులను పోలీసులు గుర్తించారు. అలాగే కాలం చెల్లిన రమ్‌జామిక్ పొడి, వాటిని ఉపయోగించి తయారు చేసిన కేకులను స్వాధీనం చేసుకున్నారు. బేకరీలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
బేకరీని నిర్వహిస్తున్న జార్ఖండ్‌కు చెందిన అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బేకరీ యజమాని నిర్మల్‌కు చెందిన ముస్తఫాకు నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ బేకరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కేకులతో పాటు అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.




