Pargi: పరిగి మార్కెట్ యార్డులో అక్రమ పేకాట దందా

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ మార్కెట్ కమిటీ దుకాణ సముదాయంలో సాగుతున్న అక్రమ పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.

WAZID, PARIGI
Published on: 15 July 2026 10:48 AM IST
Pargi
X

Pargi: పరిగి మార్కెట్ యార్డులో అక్రమ పేకాట దందా

PARGI: వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ మార్కెట్ కమిటీ దుకాణ సముదాయం వేదికగా సాగుతున్న అక్రమ పేకాట దందా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు.

ప్రతి శుక్ర, శనివారాల్లో మాత్రమే మార్కెట్ వ్యాపారం జరిగే ఈ దుకాణ సముదాయాలు.. మిగిలిన రోజుల్లో పేకాట స్థావరాలుగా మారినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు దుకాణాల వెనుక ద్వారం గుండా లోపలికి వెళ్లి దాడులు నిర్వహించారు.

దాడుల సమయంలో దర్జాగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,600 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిలో అదే మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలను నిర్వహిస్తున్న వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా పేకాట దందా సాగుతున్నట్లు స్థానికంగా ప్రచారం ఉంది.

ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story