Bhagyanagar: గణేష్ ఉత్సవ సమితి ఏఎస్ రావు నగర్ కన్వీనర్‌గా సోమేశ్ నాయుడు
Bhagyanagar: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కన్వీనర్‌గా సోమేశ్ నాయుడు నియామకం. రాఘవరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం స్వీకరణ.
Bhagyanagar: గణేష్ ఉత్సవ సమితి ఏఎస్ రావు నగర్ కన్వీనర్‌గా సోమేశ్ నాయుడు
Bhagyanagar: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కన్వీనర్‌గా సోమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ కార్యదర్శులు ఆలె భాస్కర్ ,నాయిని బుచ్చిరెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జి రమేష్ ,ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ ఏనుగు రాజిరెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, ఉత్సవ సమితి నాయకులు పెద్దల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ నాయుడు కి పలువురు అభినందనలు తెలిపారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాలను మరింత సమన్వయంతో, భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా మరియు వైభవంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా సమాజంలో ఐక్యత,సాంస్కృతిక చైతన్యం మరియు సామాజిక స్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.




