Somajiguda: మట్టి గణనాథులనే ప్రతిష్టిద్దాం – జై గణేష భక్తి సమితి

Somajiguda: పర్యావరణహిత మట్టి గణపతులను ప్రతిష్టించి వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని జై గణేష భక్తి సమితి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలో పోస్టర్ ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 5 Sept 2026 5:07 PM IST
Somajiguda
X

Somajiguda: మట్టి గణనాథులనే ప్రతిష్టిద్దాం – జై గణేష భక్తి సమితి

సోమాజిగూడ: పర్యావరణహితమైన మట్టి గణనాథులను ప్రతిష్టించి ఏకదంతుని వేడుకలను ఘనంగా నిర్వహించుకుందామని జై గణేష భక్తి సమితి విజ్ఞప్తి చేసింది.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మట్టి గణపతులను పెడదాం పర్యావరణాన్ని కాపాడుదామని నినాదాలుతో కూడిన పోస్టర్లను చైర్మన్ ఆనంద్ రావు, అధ్యక్షుడు ఏ. జైన్ కుమార్ లు ఆవిష్కరించారు.

బంగ వారు మాట్లాడుతూ 2016 లో సమితిని ప్రారంభించి మట్టి గణపతులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మండప నిర్వహకులు తప్పనిసరిగా మట్టి వినాయకులను ప్రతిష్టించి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభంభించేలా వేడుకలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story