Kadthal: కర్కల్‌పహాడ్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందుతాయని వెల్లడి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Sept 2026 2:49 PM IST
Kadthal
X

Kadthal: కర్కల్‌పహాడ్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాణవత్ తేజీరామ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బత్తోజు విష్ణువర్ధన్, గ్రామ అధ్యక్షులు పట్నం కృషయ్య, కంబాలపల్లి వీరయ్య, సయ్యద్ జాలాలుద్దీన్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం, రాజేందర్ రెడ్డి, పట్నం నర్సింహ, కానుగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY