Shabad: షాబాద్‌లో మారణహోమం.. ఆరుగురి దారుణ హత్య!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఘోర పాతకానికి ఆరుగురు బలయ్యారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 July 2026 7:52 AM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో మారణహోమం.. ఆరుగురి దారుణ హత్య!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒకేసారి ఆరు మంది దారుణ హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడే స్వయంగా తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, ఆపై తాను కూడా ప్రాణాలు తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

రెండు వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ఒక ప్రాంతంలో ముగ్గురిని, మరో ప్రాంతంలో ఒకరిని , షాబాద్ లో ఇద్దరిని చంపినట్లు తెలుస్తోంది. "నేనే ఆరు మందిని మర్డర్ చేశాను... ఒకచోట ముగ్గురిని, మరొకచోట ముగ్గురిని హతమార్చాను" అంటూ తల్లిదండ్రులకు ఫోన్

"నేను కూడా చచ్చిపోతున్నా.." నిందితుడి హెచ్చరిక

ఆరు మందిని పొట్టనబెట్టుకున్న సదరు వ్యక్తి... "కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతున్నాను" అని సంచలన ప్రకటన చేశాడు. ఈ మాటతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

విషయం తెలియగానే రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, భారీగా పోలీసు బందోబస్తుతో షాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, అసలు ఈ దారుణానికి గల కారణాలు ఏంటి?

పాత కక్షలా? లేక కుటుంబ కలహాలా?

అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే రోజు ఆరు మంది హత్యకు గురికావడంతో షాబాద్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చేస్తున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న cp తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతం చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story