Rangareddy: శెట్టిపల్లికి సర్పంచ్ చొరవతో తీరిన రవాణా కష్టాలు!

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లికి బస్సు సౌకర్యం పునరుద్ధరణ. సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ చొరవతో గ్రామస్తుల చిరకాల కల సాకారం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Aug 2026 11:49 AM IST
Rangareddy
X

Rangareddy: శెట్టిపల్లికి సర్పంచ్ చొరవతో తీరిన రవాణా కష్టాలు!

Rangareddy: శెట్టిపల్లి గ్రామ ప్రజల రవాణా కష్టాలకు తెరపడింది. ఆమనగల్–మేడిపల్లి–మాల్ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.

కొద్దిరోజుల క్రితం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పొనుగోటి యాదగిరి రావు గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న సర్పంచ్ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ సమస్యపై ముద్విన్, చరి కొండ గ్రామాల సర్పంచులతో చర్చించి, ఆయా గ్రామాల ప్రజలకు కూడా ఉపయోగపడేలా బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. అనంతరం సంబంధిత రవాణా అధికారులను కలిసి పరిస్థితిని వివరించి, బస్సు సౌకర్యం కల్పించాలని రవాణా అధికారులను కోరడం జరిగింది.

సర్పంచ్ గారి చొరవ, నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈరోజు శెట్టిపల్లి గ్రామానికి బస్సు రావడంతో గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. ఇకపై విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు ఆమనగల్–మేడిపల్లి–మాల్ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు మరింత సౌకర్యంగా మారనుంది.

గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చే వరకు కృషి చేసిన సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సమస్యను తెలుసుకోవడం మాత్రమే కాదు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేయడమే నిజమైన ప్రజా సేవకు నిదర్శనం. శెట్టిపల్లి గ్రామ ప్రజల బస్సు సౌకర్యం విషయంలో సర్పంచ్ గారి చొరవ ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story