Shankarpally: శంకర్పల్లిలో సీరియల్ దొంగల గ్యాంగ్ అరెస్ట్

Shankarpally: శంకర్పల్లిలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర పర్డీ గ్యాంగ్ అరెస్ట్. ఇద్దరు నిందితుల రిమాండ్, భారీగా సొత్తు స్వాధీనం.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 16 Aug 2026 7:29 PM IST
Shankarpally
X

Shankarpally: శంకర్పల్లిలో సీరియల్ దొంగల గ్యాంగ్ అరెస్ట్

శంకర్పల్లి: పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలవర్తి గ్రామంలో చోరీకి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని శంకర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు, 16-08-2026 ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శంకర్పల్లి పోలీస్ సిబ్బంది రైస్ మిల్ రోడ్డు temporary గుడిసెల దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి వారిని అదుపులోనికి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించబడ్డారు. విచారణలో భాగంగా, 11- 08-2026 అర్ధరాత్రి సుమారు 02:00 గంటల సమయంలో ఎలవర్తి గ్రామంలోని ఒక ఇంటిలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.

నేరం జరిగిన విధానం

నిందితులు ఎలవర్తి గ్రామంలో తిరుగుతూ ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం, తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ సహాయంతో ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంటిలోని అల్మారాకు ఉన్న తాళాన్ని కూడా పగులగొట్టి, అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మరియు నగదును అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నిందితులు గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న శంకర్పల్లి పోలీసులకు పట్టుబడ్డారు.

విచారణలో వీరు గత ఆరు నెలలుగా శంకరపల్లి, BDL భానూర్, గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, షట్టర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పర్డీ గ్యాంగ్కు చెందిన నిందితులను శంకరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఇప్పటివరకు 11 చోరీ కేసులకు సంబంధించి నేరాలను అంగీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ గ్యాంగ్లో సుమారు 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన ఐదుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు మహారాష్ట్రలోని సోలాపూర్, జాల్నా జిల్లాల పరిసర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో మహిళలు, చిన్న పిల్లలతో కలిసి శంకర్ పల్లి, లింగంపల్లి, టోలిచౌకీ ప్రాంతాలకు వచ్చి నిర్మాణంలో ఉన్న భవనాల సమీపంలో తాత్కాలికంగా చిన్న టెంట్లు ఏర్పాటు చేసుకుని నివసించేవారు. పగటి సమయంలో మహిళలు, చిన్న పిల్లలతో కలిసి గ్రామాలు మరియు పరిసర ప్రాంతాల్లో అడుక్కుంటూ సంచరిస్తూ, ఆయా ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, షట్టర్లు మరియు నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించేవారు.

రాత్రి సమయంలో పురుషులు పొలాలు, చెట్ల పొదలు మరియు ఇతర నిర్మానుష్య ప్రాంతాల గుండా కాలినడకన, కొన్ని సార్లు బైక్ పై వెళ్లి, శివార్లలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారు.

నిందితులు ముందుగా పరిసర ప్రాంతాలకు వీరు ముఖలకు మాస్కు లు, చేతులకు గ్లోవ్ లు వేసుకొని, ఒకరు లేదా ఇద్దరు కాపలాగా ఉండగా, మిగిలిన వారు ఇనుప రాడ్లు తదితర సామగ్రితో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించేవారు. చోరీలకు వెళ్లే సమయంలో తాళాలు పగులగొట్టేందుకు అవసరమైన సామగ్రితో పాటు, ఎవరైనా తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడి చేయడానికి కొడవలి వంటి ఆయుధాలను కూడా వెంట తీసుకెళ్లేవారని దర్యాప్తులో వెల్లడైంది. చోరీ చేసిన అనంతరం అపహరించిన సొత్తును గ్యాంగ్ లోని శివమణి మరియు వీరి గ్యాంగ్ లోని మహిళల ద్వారా డిస్పోజ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు 11 చోరీ నేరాల అంగీకారం

పోలీసుల విచారణలో నిందితులు గత ఆరు నెలల కాలంలో శంకర్పల్లి, BDL భానూర్, గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల్లో మొత్తం 11 చోరీ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులకు సంబంధించి నిందితుల నుంచి చోరీ సొత్తు, నేరానికి ఉపయోగించిన సామగ్రి మరియు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నేరస్తుల వివరాలు:

A3) విశాల్ భగవత్ షిండే, తండ్రి: భగవత్ టికులే షిండే, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: జాడి, పోస్టు: ఉపలే ధుమాలా, తాలూకా: బార్షి, జిల్లా: సోలాపూర్, మహారాష్ట్ర. (అదుపులో)

A4) కృష్ణ దండేకర్ భోంస్లే, తండ్రి: దండేకర్ భోంస్లే, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: ఖేర్ గ్రామం, జాల్నా తాలూకా & జిల్లా, మహారాష్ట్ర. (అదుపులో)

Absconding:

A1) శివాజీ భోంస్లే @ శ్రీనివాస్ భోంస్లే @ శివా, (పరారీలో ఉన్నాడు)

A2) రాహుల్ విజయ్ పవార్, (పరారీలో ఉన్నాడు)

A5) రాహుల్ మామగారు (Father-in-law) – (పరారీలో ఉన్నాడు)

A6) జమున – (పరారీలో ఉంది)

వీరి నుండి నగదు రూ.5000/-, అర తులం బంగారం మరియు lock break చేయడానికి ఉపయోగించే Rod.

ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది

1. G. Rudveer Kumar, Inspector.

2. K. 2 - SIP

3. ASI నాగై రెడ్డి

4. PC నాగభూషణం

5. PC యాదగిరి

6. ఇతర పోలీసు సిబ్బంది

— శంకర్పల్లి పోలీస్ స్టేషన్

పోలీసుల సూచనలు

ప్రజలు తమ ఇళ్లను ఖాళీగా ఉంచి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, విలువైన నగలు మరియు నగదును ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా సంచార గుంపులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.

పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చోరీలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story