Shamshabad: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం పల్టీ.. భారీగా ట్రాఫిక్ జామ్!
Shamshabad: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం. ఎగ్జిట్ 17 వద్ద టైరు పేలి పల్టీ కొట్టిన డీసీఎం వాహనం. డ్రైవర్‌కు గాయాలు, భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్.
Shamshabad: ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం పల్టీ.. భారీగా ట్రాఫిక్ జామ్!
Shamshabad: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్-17 వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ వైపు నుంచి నార్సింగి దిశగా వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Next Story




