Shamshabad: శంషాబాద్‌లో రూ. 6 కోట్ల చిట్టీల మోసం: రంగంలోకి పోలీసులు!
Shamshabad: శంషాబాద్ బుద్వేల్ గ్రీన్ సిటీలో రూ.6 కోట్ల చిట్టీల మోసం. అధిక లాభాల పేరుతో ముంచాడని అశోక్‌పై బాధితుల ఆరోపణ, న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి.
Shamshabad: శంషాబాద్‌లో రూ. 6 కోట్ల చిట్టీల మోసం: రంగంలోకి పోలీసులు!
శంషాబాద్:
చిట్టిల పేరుతో తమను నిండా ముంచాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో తమను మోసం చేశాడంటూ పానగంటి అశోక్‌పై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఐఎంఆర్ మిల్లెట్ రీసెర్చ్ పేరుతో విధులు నిర్వహిస్తూ, అధిక లాభాలు వస్తాయని నమ్మించి తమ నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. రోజువారీ కూలీలు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు... ఇలా ఎంతో మంది తమ కష్టార్జిత సొమ్మును చిట్టీల్లో పెట్టుబడిగా పెట్టారు. కొందరు తమ పింఛన్ డబ్బును కూడా అశోక్ వద్ద చిట్టీల్లో జమ చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిట్టీలు పూర్తయినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 లక్షల రూపాయలు తమకు రావాల్సి ఉందని కొందరు చెబుతుండగా, మొత్తం బాధితులందరూ కలిపి దాదాపు రూ.6 కోట్ల మేర మోసపోయామని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని, తమ కష్టార్జిత సొమ్ము తిరిగి ఇప్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిజానిజాలు వెలికితీయాల్సి ఉంది. పోలీస్ అధికారుల విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది.




