Shamshabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు

Shamshabad: శంషాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు. ఒకరికి గాయాలు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 18 Aug 2026 9:54 PM IST
Shamshabad
X

Shamshabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు

శంషాబాద్: పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫై డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన కారు, ఒకరికి గాయాలు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పిల్లర్ నంబర్ 172 వద్ద మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story