Medchal: శామీర్‌పేటలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్!

Medchal: శామీర్‌పేటలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బైద్‌నాథ్ అరెస్ట్. 25 కేజీల బరువున్న 5298 చాక్లెట్ ప్యాకెట్లు స్వాధీనం.

PURENDAR, ALWAL
Published on: 29 Aug 2026 4:36 PM IST
Medchal
X

Medchal: శామీర్‌పేటలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్!

Medchal: మేడ్చల్ జిల్లా, అల్వాల్ పురేందర్ యాదవ్ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్, ఒకరు పరారి. శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్. బీహార్ రాష్ట్రానికి చెందిన బైద్నాద్ 29 అనే వ్యక్తి తన భార్య పూజా కుమారితో కలిసి విక్రాయిస్తుండగా పట్టుబడ్డారు.

నిందితుడు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తూముకుంట చంద్రా రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. తుంకుంట లో పాన్ షాప్ నిర్వహిస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. బీహార్ రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో సరుకు తెచ్చి ఒక్కో ప్యాకెట్ ను 500 నుంచి ఆరు వందలకు విక్రాయిస్తున్నాడు.

విశ్వసనీయమైన సమాచారం మేరకు శామీర్ పేట పోలీసులు బైద్నాద్ పాన్ షాప్ లో దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 5298 చాక్లెట్ ప్యాకెట్లు, సుమారు 25 కేజీలు స్వదినం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పరారిలో ఉన్న నిందితుడి భారీ పూజా కుమారి కోసం పోలీసులు గలీస్తున్నట్లు తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story