Shabad: పెద్దవేడులో పాఠశాల భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

Shabad: షాబాద్ మండలం పెద్దవేడులో అమెజాన్ నిర్మించిన పాఠశాల, అంగన్వాడీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. విద్యాభివృద్ధికి కృషి హర్షణీయమని వెల్లడి.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 19 Aug 2026 6:38 PM IST
Shabad
X

Shabad: పెద్దవేడులో పాఠశాల భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

షాబాద్: షాబాద్ మండలం పెద్దవేడు గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడీ భవనాలను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య పాఠశాల భవనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులు మరియు చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. నూతన భవనాల ద్వారా గ్రామంలోని విద్యార్థులు, చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు సురక్షితమైన, నాణ్యమైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగ అభివృద్ధికి అమెజాన్ సంస్థ చేపట్టిన ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య అభినందించారు. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

పిల్లలకు మంచి విద్యా వాతావరణం కల్పిస్తేనే గ్రామీణ ప్రాంతాల భవిష్యత్ తరాలకు బలమైన పునాది ఏర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు అమెజాన్ సంస్థకు, ఎమ్మెల్యే కాలే యాదయ్య కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, అమెజాన్ సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story