Shabad: షాబాద్‌లో రేడియల్ రోడ్ 2 భూసేకరణ పరిహారం విడుదల

Shabad: షాబాద్ మండలంలో రేడియల్ రోడ్ 2 నిర్మాణ భూసేకరణ బాధితులకు రూ.37.11 కోట్లకు పైగా పరిహారం జమ. వెల్లడించిన ఆర్డీవో పార్థసారధి రెడ్డి, తహసీల్దార్ అన్వర్.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 23 July 2026 7:04 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో రేడియల్ రోడ్ 2 భూసేకరణ పరిహారం విడుదల

షాబాద్: మండల పరిధిలో ప్రతిపాదిత రేడియల్ రోడ్ 2 నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతు లకు 37.11 కోట్లకు పైగా పరిహారం విడుదల అయిందని ఆర్డిఓ పార్థసారధి రెడ్డి,షాబాద్ తాసిల్దార్ అన్వర్ గురువారం రైతులతో సమావేశ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... విశేష సహకారంతో అవార్డు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.

ఇప్పటివరకు 344 మంది రైతుల నుండి సమ్మతి లభించగా 228.31 ఎకరాల భూమికి అవార్డులు పూర్తి చేయబడ్డాయి. సోలిపేట్, పెద్దవేడు, హైతాబాద్, దామర్లపల్లి, మరియు మాచనపల్లి గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.37,11,12,500 పరిహారాన్ని జమ చేయడం జరిగింది. దీనితో సంబంధిత రైతులు మెరుగైన పరిహారం లాబించడం తో అత్యంత శ్రీగ్రంగా పరిహారం అందించడంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

అలాగే షాబాద్ మరియు బోనగిరపల్లి నాగర్కుంట గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం నేటి నుండి జమ చేయబడతాయి. అంతే కాకుండా, ఇంటి స్థలాలు కూడా అతి త్వరలో అందించ బడతాయన్నారు.

ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియకు స్వచ్ఛందంగా సహకరించిన రైతులు మరియు ప్రజా ప్రతినిదులకు జిల్లా యంత్రాంగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మిగిలిన రైతులు కూడా ఇదే విధంగా సహకరించి ప్రజాప్రయోజనకరమైన రేడియల్ రోడ్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి తోడ్పడాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సోలిపేట సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కేశవ గూడ సర్పంచ్ ఒగ్గు రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story