Shabad: షాబాద్‌లో పోలీసుల వాహన తనిఖీలు - అవగాహన కార్యక్రమం
Shabad: షాబాద్ మండలం నగర్‌కుంట చౌరస్తా వద్ద ఎస్ఐ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు, రోడ్డు భద్రతపై అవగాహన.
Shabad: షాబాద్‌లో పోలీసుల వాహన తనిఖీలు - అవగాహన కార్యక్రమం
షాబాద్: షాబాద్ మండల పరిధిలోని నగర్‌కుంట చౌరస్తా వద్ద షాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ చెన్నారెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రహదారి నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధించడమే కాకుండా రోడ్డు భద్రతపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
తనిఖీల సమయంలో ఎస్ఐ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని అలాగే వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ వంటి అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణ రక్షణగా నిలుస్తుందని కుటుంబ సభ్యుల సంక్షేమం దృష్ట్యా ప్రతి ఒక్కరూ వాహన చోదన నిబంధనలను పాటించాలని సూచించారు.
అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ తనిఖీలు మరియు ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




