Shabad: షాబాద్‌లో అశ్రునయనాల మధ్య మలగళ్ల సతీష్ కుమార్ అంత్యక్రియలు!

Shabad: షాబాద్ అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్షుడు మలగళ్ల సతీష్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 9 Aug 2026 3:09 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో అశ్రునయనాల మధ్య మలగళ్ల సతీష్ కుమార్ అంత్యక్రియలు!

Shabad: షాబాద్ అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్షులు మలగళ్ల సతీష్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం భారీ జన సందోహం మధ్య నిర్వహించారు. సతీష్ కుమార్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, యువత, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

అంబేద్కర్ యూత్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో సతీష్ కుమార్ యువతకు అందుబాటులో ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి షాబాద్ ప్రాంతంలో విషాదాన్ని నింపిందని, యువతకు ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య సతీష్ కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story