Serilingampally: శేరిలింగంపల్లిలో దేవాలయాలకు బోనాల ఆర్థిక సహాయం
Serilingampally: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 దేవాలయాలకు రూ.30.71 లక్షల బోనాల ఆర్థిక సహాయం అందజేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
Serilingampally: శేరిలింగంపల్లిలో దేవాలయాలకు బోనాల ఆర్థిక సహాయం
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన రూ.30,71,000/- ముప్పై లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయంను అందచేసిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు... బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగా వైభవంగా, ఘనంగా నిర్వహించుకుందాం.
గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెక పూడిగాంధీ గారు
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన రూ.30,71,000/- ముప్పై లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ను గౌరవ EO శ్రీ సత్యనారాయణ గారు, గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి ఆలయ ధర్మకర్తలకు అందచేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడానికి నిధులు మంజూరి చేయడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ గారు అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు అని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద మనస్సు తో ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరి చేయడం జరిగినది అని, మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల 92 దేవాలయాలకు గాను రూ. 30,71,000/- రూపాయలు మంజూరి అయినవి అని, ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేయడం జరుగుతుంది అని, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. ప్రతి భక్తుడు అమ్మవారి ఆశీస్సులతో ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకునేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.
బోనాలను అంగరంగా వైభవంగా నిర్వహించుకోవడానికి నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగినది అని, ప్రశాంత వాతావరణంలో బోనాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, ఆలయ ధర్మ కర్తలు తదితరులు పాల్గొన్నారు.




